Monday, December 23, 2024

నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి : వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజని కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం డిజిపి కార్యాలయం నుంచి పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పిలతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలో నేరాలు నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను వనపర్తి జిల్లా ఎస్పి రక్షిత కె. మూర్తిని డిజిపి అడిగి తెలుసుకున్నారు.

వనపర్తి జిల్లాలో కేసులు పరిష్కారానికి అధికారులు చూపిస్తున్న చొరవ, నేరాలకు పాల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షలు పడే విధంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలను డిజిపికి జిల్లా ఎస్పి వివరించారు. ఈ సందర్భంగా డిజిపి అంజిని కుమార్ మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజా మన్ననలు పొందేలా ము ందుకు సాగాలన్నారు. పెరిగిపోతున్న వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం ద్వారా తెలంగాణ పోలీసుల గౌరవం మరింత ఇనుమడించేలా పని చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా నిఘా వ్యవస్థకు ప్రధాన సంపత్తిగా మా రిన సిసి టివిల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న క్రమంలో నేతు సైతం కమ్యూనిటి పోలిసింగ్ లో సిసి కెమెరాల ఏర్పాటును మరింత ప్రొత్సహించే విధంగా అన్ని జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.

పోక్సో కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవసరమైన అన్ని రకాల రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం, అన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలనపు అధిగమించేందుకు సంబంధిత శాఖలు, ప్రలజను సమన్వయం చేస్తూ వాటిని అధిగమించేలా ముందుకు సాగాలన్నారు. అలాగే రానున్న తెలంగాణ ఎన్నికల గురిం చి ముందస్తుగా అన్ని వివరాలు సేకరించి పెట్టుకోవాలని డిజిపి జిల్లా ఎస్పిలను ఆదేశించారు. ఈ సమావేశంలో వనపర్తి జిల్లా అదనపు ఎస్పి షాకీర్ హుస్సేన్, డిఎస్పి ఆనంద రెడ్డి, ఐటి కోర్ ఎస్సై జయాన్న, డిసిఆర్‌బి, ఎస్సై వెంకటేశ్వర్లు గౌడ్, కానిస్టేబుల్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News