Wednesday, January 22, 2025

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -
  • ఐజి ప్రభాకర్‌రావు

ఆసిఫాబాద్ ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని గ్రేహౌండ్స్ అడిషనల్ డిజి ఎంపి విజయ్‌కుమార్, ఎస్‌ఐబి ఐజి ప్రభాకర్ అధ్వర్యంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, నిర్మల్, అదిలాబాద్ పోలీసు ఉన్నతాధికారులు కుమ్రంభీం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ముందుగా గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు కదలికలపై తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని తెలిపారు. ఫలితంగా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని అన్నారు.

జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను ఉపయోగించి పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని, మావోయిస్టు ప్రభావిత కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ సమస్యలను ముందుగానే గుర్తించి సమాచారాన్ని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్, ఎస్‌ఐబి వేణుగోపాలరావు, అదిలాబాద్ ఎస్పి ఉదయ్‌కుమార్‌రెడ్డి, నిర్మల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్‌రావు, సిఅర్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ విజయరాఘవన్, డిఎస్‌పిలు వెంకటరమణ, కరుణాకర్, రమేష్, సిఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News