Tuesday, December 24, 2024

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్  : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా సంబంధిత తహసీల్దార్లు, ఎంపిడిఒలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఫిర్యాదుదారు సమస్యను వారికి తెలియజేస్తూ సదరు ఫిర్యాదును తక్షణమే పరిష్కరించాలని, అదే విధంగా ఫిర్యాదు పరిష్కారాన్ని ఫిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాలని, ఫిర్యాదుల పరిష్కారం లో అన్ని స్థాయిలలో జాప్యం చేయవద్దని చెప్పారు.

రెండవ విడత గొర్రెల పంపిణీకి వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు, ఎంపిడిఒలు ధృవీకరించాలని , దరఖాస్తులను కులం, గ్రామంలో నివసిస్తున్నది లే నిది , ఇతర నిబంధనలు క్షుణ్ణంగా పరిశీలించాల ని అన్నారు. భూములకు సంబంధించిన ఫిర్యాదు లు, వ్యక్తిగత ఫిర్యాదులు, పెన్షన్ మంజూరు , ఉద్యోగం, పారిశుద్ధం, హాస్టళ్లలో సీట్ల కేటాయింపు, తదితర అంశాలకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీఓ అనిల్‌కుమార్, జడ్పీసీఈఓ జ్యోతి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి, డిఆర్డీఓ యాదయ్య, సిపిఓ దశరథం, జిల్లా అధికారులు, ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News