Monday, December 23, 2024

మైనార్టీలకు ప్రత్యేక స్మశాన వాటికలు

- Advertisement -
- Advertisement -

తుదిదశకు చేరిన స్థల సేకరణ ప్రక్రియ
మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక: కలెక్టర్ శర్మన్

Special burial grounds for minorities

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్‌లోని మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా స్మశాన వాటికల ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పురపాలక శాఖ మంత్రి కె.తారక రామరావు ఆదేశాల మేరకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో ప్రత్యేకంగా స్థలాల సేకరణకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అధికారుల చేపట్టిన ఈ స్థల సేకరణ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. గ్రేటర్ పరిధిలో మైనార్టీల స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపుకు సంబంధించి మరో మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ మీడియాకు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్‌లు హైదరాబాద్ నగర పరిసర పాంత్రాలతో పాటు మేడ్చల్ జిల్లా పరిధిలోని ఖాళీగా ఉన్న స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు శర్మన్ మాట్లాడుతూ పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థన మేరకు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాలతో జిల్లాలోని బాల్‌నగర్ ప్రాంతంలో ఉన్న మైనార్టీలకు సంబంధించిన స్మశాన వాటికలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో స్మశాన వాటికల కోసం స్థలాలను పరిశీలించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మైనార్టీ వర్గాలకు సంబంధించి స్మశాన వాటికలను కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాలతో తనతో పాటు మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టర్‌తో కలిసి స్థలాలను పరిశీలించామన్నారు. ఇందుకు సంబంధించి స్థలాల పూర్తి వివరాలతో మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ మల్లయ్య, తహశీల్దార్‌తో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News