Monday, December 23, 2024

సంగారెడ్డి నుంచి అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేక బస్

- Advertisement -
- Advertisement -
  • డిఎం ఉపేందర్

సంగారెడ్డి: అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడపనున్నట్లు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. పౌర్ణమిని పురస్కరించుకొని జూలై31వ తేదీన జరిగే గిరి ప్రదర్శనకు సూపర్ లగ్జరీ బస్సులు సంగారెడ్డి నుండి నడపుతామన్నారు. సంగారెడ్డిలో రాత్రి 7గంటలకు సంగారెడ్డి నుండి హైద్రాబాద్ మీదుగా అరుణాచలం బస్సు బయలు దేరుతుందన్నారు. ఆంధ్రప్రదేష్‌లోని కాణిపాకంలోని వినాయకుడి దేవాలయం వేలూరులోని మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని జూలై 31వ తేదీన రాత్రి 8గటంలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు.

అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదర్శన తర్వాత ఆగస్టు1వ తేదీనాడు సాయంత్రం 3గంటలకు బయలు దేరి మరుసటి రోజు గద్వాలలోని జోగులాంబ అమ్మవారి శక్తి పీఠంకు చేరుకొని భక్తుల దర్శనం అనంతరం అదే రోజు సాయంత్రానికి సంగారెడ్డికి బస్సు చేరుకుంటుందన్నారు. అరుణాచల గిరి ప్రధర్శన టూర్ ప్యాకేజీ టిఎస్‌ఆర్‌టిసి అందిస్తుందన్నారు. ఈ ప్యాకేజీ ధరను ఒకరికి 4వేల రుపాయలు సంస్థ నిర్ణయించిందన్నారు. ఈ సదుపాయాన్నీ కావాలనుకునే వారు సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.inలో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా వాసులు తమ దగ్గరలోని ఆర్టీసి బస్‌స్టాండ్‌లలో టిఎస్‌ఆర్‌టిసి రిజర్వేషన్ కౌంటర్‌లలో బుక్ చేసుకోవాలని డిఎం శనివారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News