Thursday, January 23, 2025

మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు టిఎస్ ఆర్టీసి గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసి ప్రకటించింది. శ్రీశైలానికి జంటనగరాల నుంచి 390 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ తెలిపారు. శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను దర్శించుకునేందుకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్, దిల్‌సుఖ్ నగర్ బస్‌స్టేషన్, ఐఎస్ సదన్, కెపిహెచ్‌బి, బిహెచ్‌ఈఎల్ పాయింట్లతో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.

మిగతా 68 బస్సులు ఇతర ప్రాంతాల నుంచి

ఈనెల 16వ తేదీన 36 ప్రత్యేక బస్సులు, 17వ తేదీన 99, 18వ తేదీన 99, 19వ తేదీన 88 బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. మిగతా 68 బస్సులు ఇతర ప్రాంతాల నుంచి నడపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి శ్రీశైలానికి సూపర్ లగ్జరీలో ఒకరికీ రూ.600, డీలక్స్ రూ.540, ఎక్స్‌ప్రెస్‌కు రూ.460, నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి సూపర్ లగ్జరీలో ఒకరికీ రూ.650, డీలక్స్‌కు రూ.580, ఎక్స్‌ప్రెస్‌లో రూ.500 వసూలు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించామని, ఇతర వివరాల కోసం ఎంజీబిఎస్‌లో 9959226250, 9959226248, 9959226257 ఫోన్ నెంబర్, జేబిఎస్‌లో 9959226246, 040-27802203, ఐఎస్ సదన్‌లో 9959226250, బీహెచ్‌ఈఎల్‌లో, కెపిహెచ్‌బి పాయింట్లకు సంబంధించి ఈ 9959226149 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News