Wednesday, January 22, 2025

గ్రూప్ 4 పరీక్షకు ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి టౌన్: గ్రూప్ 4పరీక్షకు జూలై1న వివిధ ప్రాంతాల నుండి పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసి బస్సులను నడపనున్నట్లు మెడక్ రీజియన్ రీజినల్ మేనేజర్ సుదర్శన్ అన్నారు. 1వ తేదీనాడు జిల్లాలో మెదక్ రీజియన్ పరిథిలో 134 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 7ః 30 నుంచి 9ః30వరకు పరీక్ష కేంద్రాల దగ్గరకు అభ్యర్థులను చేరేలా ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం అభ్యర్థులు తిరుగు ప్రయాణం అయ్యేందకు బస్సులను నడపనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 101కేంద్రాలకు 54బస్సులు, సిద్దిపేట జిల్లాలో 52బస్సులు, మెదక్ జిల్లాలో 30 బస్సులను పరీక్ష కేంద్రాలకు నడపపుతామని, రోజు తిరిగే బస్సులను కూడ వినియోగించుకోవాలని ఆర్‌ఎం గురువారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News