Wednesday, January 22, 2025

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో జాతరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసి నిర్ణయించింది. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి కల్యాణోత్సవం, పట్నం వారం, లష్కర్ వారం, మహా శివరాత్రి పర్వదినం రోజు పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే మల్లన్న భక్తులు టిఎస్ ఆర్టీసి శుభవార్త చెప్పింది.

జాతరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్టు ఆర్టీసి గ్రేటర్ జోన్ ఈడి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జేబిఎస్ మీదుగా కొమురవెల్లికి బస్సులు నడుపనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 5.40 గంటలకు జాతరకు బస్సులు బయలుదేరుతాయని ఆయన వెల్లడించారు. మళ్లీ కొమురవెల్లి నుంచి ఉదయం 10.50 గంటలకు, మధ్యాహ్నం 3.30 గంటలకు, సాయంత్రం 7.50 గంటలకు సిటీకి బస్సులు బయలుదేరుతాయన్నారు. ఈ సదావకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News