Saturday, December 21, 2024

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ క్రమంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసి అధికారులు వెల్లడించారు. వేములవాడ, కాళేశ్వరం, రామప్పగుడి, వెయ్యి స్తంభాల గుడి, పాలకుర్తి తదితర శివాలయాలకు ఈ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రతి ఆదివారం, కార్తీక పౌర్ణమి ముందురోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ఈ బస్సులు బయలు దేరుతాయని అధికారులు చెప్పారు. మళ్లీ దర్శనం అనంతరం సోమవారం రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పంచారామ క్షేత్రాలకు బస్సులు నడుపనున్నారు. ఈ బస్సులు కూడా ప్రతి ఆదివారం, పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నాయి. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాయని ఆర్టీసి అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News