న్యూఢిల్లీ: ప్రత్యేక విమానం ద్వారా శుక్రవారం అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్ నుంచి 104 మంది పౌరులు చేరుకున్నారు. వీరిలో 10 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఆపరేషన్ దేవీశక్తి కింద ప్రత్యేక విమానాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందం బగ్చి తెలిపారు. ఆపరేషన్ దేవీశక్తి కింద భారత్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం కాబుల్ నుంచి ఢిల్లీకి చేరుకుందని, ఇందులో 10 మంది భారతీయులతోసహా 94 మంది అఫ్ఘాన్ పౌరులు ఉన్నారని, వీరిలో హిందు-సిక్కు-మైనారిటీలకు చెందిన వారు ఉన్నారని బగ్చి తెలిపారు. ముగ్గురు చంటిబిడ్డలతోసహా 9 మంది పిల్లలు వీరిలో ఉన్నారని ఆయన చెప్పారు. భారత్‌లో చిక్కుకుని నిలిచిపోయిన 90 మంది అఫ్ఘాన్ పౌరులతోపాటు కొన్ని వైద్య సరఫరాలతో ఈ విమానం తిరిగి కాబుల్‌కు వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కాబుల్‌లోని పురాతన అసమై మందిరం నుంచి గురు గ్రంథ్ సాహిబ్, హిందూ పురాణ గ్రంథాలకు చెందిన మూడు ప్రతులను ఈ విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చినట్లు వారు చెప్పారు.
కాబుల్ నుంచి ప్రత్యేక విమానంలో 104 మంది ఢిల్లీకి తరలింపు
- Advertisement -
- Advertisement -
- Advertisement -