Wednesday, December 25, 2024

వాహనాల ప్రత్యేక తనిఖీలు .. 40 వాహనాలు సీజ్

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: పెద్దపల్లి పోలీసులు బుధవారం రాత్రి పట్టణంలో వాహనాలకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సిఐ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ సర్కిల్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్‌లు లేకపోవడం, టాంపరింగ్ చేయడం, లైసెన్స్‌లు, ఇన్సూరెన్స్ పేపర్లు లేని 40 వాహనాలను సీజ్ చేశారు.

సంబందిత యజమానులకు ట్రాఫిక్ నిబందనలపై కౌన్సిలింగ్ నిర్వహించారు. జరిమానాలు విధించి వదిలేశారు. ప్రతి వాహన యజమాని సరైన నెంబర్ ప్లేట్‌లు బిగించుకోవాలని, లైసెన్స్‌తో పాటు భీమా ఉండాలని లేని పక్షంలో సీజ్ చేస్తామని సిఐ హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్‌ఐ మహేందర్‌తో పాటు సిబ్బంది పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News