Saturday, November 23, 2024

స్థానిక బిసి రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సం స్థల్లో బిసి రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్(ప్రత్యే క) కమిషన్ ఏర్పాటు చేసింది.ఈ ప్రత్యేక కమిషన్‌కు రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వర రావు నేతృత్వం వహించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పే ర్కొంది. బిసి గురుకుల సొ సైటీ కార్యదర్శి బి.సైదులు ను డెడికేటెడ్ కమిషన్‌కు సెక్రటరీ గా నియమించిం ది.ఈ మేరకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చే స్తూ సోమవారం ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజకీయాల్లో బిసి రిజర్వేషన్ల కల్పన కోసం బిసిల జనాభా లెక్కలు తీ సేందుకు ప్రత్యేక(డెడికేటెడ్) కమిషన్ ఉండాలని హైకో ర్టు స్పష్టం చే సింది. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కా నుంది.

ఈ నేపథ్యంలో బి సి రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు త లెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని ముందుకు వె ళ్లాలని ఇప్పటికే సిఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సిఎం ఆదేశాల మేరకు సోమవారం రిటైర్డ్ ఐఏఎస్ బూ సాని వెంకటేశ్వర రావు నేతృత్వంలో బిసి రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిషన్ రిజర్వేషన్లపై స మగ్ర అధ్యయనం చేసి నెల రోజుల లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వెనుకబడిన తరగతుల వెనుకబాటుతనం, సమకాలీన పరిస్థితులపై ఈ కమిషన్ అధ్యయనం చేస్తుంది.ఈ కమిషన్‌కు అవసరమైన సమాచారం, గణాంకాలు సేకరించడం కోసం వివిధ సంస్థలు, వ్యక్తుల నుండి సహాయం తీసుకోవచ్చని తెలిపింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుండి, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల సహకారం తీసుకోవచ్చని పేర్కొంది. కమిషన్ నిపుణులు, పరిశోధకులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా వారి సేవలను పొందవచ్చు. కమిషన్‌కు అవసరమైన సిబ్బంది, వారికి చెల్లించే వేతనాలు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News