Monday, December 23, 2024

భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ

- Advertisement -
- Advertisement -

ధరణి సమీక్షలో సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం

కోనేరు రంగారావు కమిటీ మాదిరిగా ఉండాలని సూచన భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం సూచించే
ప్రతిపాదనలు చేయాలని ఆకాంక్ష సభ్యులుగా మంత్రులు, రెవెన్యూ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు,
న్యాయ నిపుణులు ఉండేవిధంగా చూడాలి అసలు ధరణికి చట్టబద్ధత ఉందా అని నిలదీసిన ముఖ్యమంత్రి
ధరణి సమస్యల పరిష్కారానికి మండలస్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
నిషేధిత భూముల జాబితాపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగు మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ధరణి పో ర్టల్‌పై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం రేవంత్ ఈ మేరకు ఆదేశించారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీ ని ఏర్పాటు చేయాలని సూచించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే వి ధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలన్నారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉం డాలన్నారు.

సమావేశంలో సిసిఎల్‌ఎ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. స మీక్ష అనంతరం నిషేధిత జాబితా, అసైన్డ్ భూము లు, పట్టా భూములు తదితర అంశాలతో పాటు సమావేశంలో మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాల పై నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్‌ను సిఎం రేవం త్ ఆదేశించారు. దాదాపు 2 గంటలు సమయం పాటు ధరణిపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ధరణికి అసలు చట్టబద్ధ్దత ఏంట ని అధికారులను రేవంత్ నిలదీశారు. ధరణి పోర్టల్‌ను రూపొందించే బాధ్యత ఎవరికి ఇచ్చారు? టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్‌సైట్ క్రియేట్ చేశారు? అని అధికారులను ప్రశ్నించా రు.

తెలంగాణవ్యాప్తంగా వరకు 18 లక్షల 46 వేల 416 మందికి ఇంకా పాస్ పుస్తకాలు ఇవ్వలేదని రేవంత్ చెప్పారు. 2,31,424 దరఖాస్తులు టిఎం 33, టిఎం 15కి చెందినవని అవి పెండింగ్‌లో వున్నాయని ఆయన పేర్కొన్నారు. సాదా బైనామాల్లో తప్పులను తొలగించాలని, భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం రేవంత్ ఆదేశించారు. ధరణి పోర్టల్‌లో చాటా డేటా తప్పులు, పాస్ పుస్తకాల్లో తప్పులు సరిదిద్దాలని, కంప్యూటర్లను నమ్ముకోవద్దని, రికార్డులు రాయాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయని తెలుసుకున్న సిఎం రేవంత్ సమస్యల పరిష్కారానికి మండల స్థాయి గ్రీవిన్స్ సెల్ ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించి నివేదికలో పొందుపరచాలని ఉన్నతాధికా రులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌పై సమగ్ర అధ్యయనం చేసి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

భూముల సర్వేకు, డిజిటలైజేషన్ చేయటానికి, ఆన్‌లైన్ విధానం తీసుకురావాలని, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం రూ.83 కోట్లు ఇచ్చిందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన ఆ నిధులు ఏమయ్యాయని అధికారులను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామెదర రాజనర్సింహ, సిఎస్ శాంతికుమారి, సంబంధిత శాఖలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News