సెర్ప్ సీఈవో చైర్మన్‌గా 14మంది సభ్యులతో ఉత్తర్వులు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై దృష్టి సా రించిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది ని ర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సెర్ప్ సీఈవో ఛైర్మన్‌గా 14మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ కమిటీలో వైస్ ఛైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ కమిషనర్, సభ్యులుగా టిమా స్ సిఈఓ, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, సాం ఘీక సంక్షేమ శాఖ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న వారిని అక్కడ నుండి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే మూసీ పరివాహక బాధితుల నుండి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.