Wednesday, January 22, 2025

వానకాలం ముగిసే వరకు ప్రత్యేక కంట్రోల్ రూంల ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

Special control rooms set up in rainy season: Raghuma Reddy

వర్షాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో
సిబ్బంది అందుబాటులో ఉండాలి
15 మంది స్కిల్డ్ సిబ్బందితో డివిజన్ స్థాయి డిజాస్టర్ టీంల ఏర్పాటు
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి జి.రఘుమా రెడ్డి

హైదరాబాద్: వానకాలం ముగిసే వరకు ప్రతి జిల్లా, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని, వర్షాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూపరింటెండింగ్ ఇంజనీర్లను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి జి.రఘుమా రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి- సిఎండి జి.రఘుమా రెడ్డి, డైరెక్టర్ ఆపరేషన్స్ జె.శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెం డింగ్ ఇంజనీర్లతో విద్యుత్ సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎండి రఘుమా రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా పర్యవేక్షణ కోసం స్కోడాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్, జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో మరో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. 15 మంది స్కిల్డ్ సిబ్బందితో డివిజన్ స్థాయి డిజాస్టర్ టీంలను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ టీంలు నిరంతరం విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తూ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తా యని సిఎండి తెలిపారు. వర్షాలు పడేటప్పడు సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సిఎండి కోరారు.

సిఎండి సూచించిన జాగ్రత్తలు ఇలా….
1.వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల క్రింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిలబడరాదు. వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలి. పశువులను, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాల నుంచి దూరంగా ఉంచాలి.
2.రోడ్డు మీద, నీటిలో కానీ విద్యుత్ తీగ పడి ఉంటే ఆ తీగను తొక్కడం, వాటి మీది నుంచి వాహనాలు నడపడం చేయరాదు. ఒకవేళ ఎక్కడైనా తీగలు తెగిపడ్డట్టు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి.
3.విద్యుత్ స్తంభాలను, స్టే వైర్లను తాకరాదు. ఒక వేళ ఎవరైనా తాకి విద్యుత్ షాక్ బారిన పడినప్పుడు వారిని రక్షించడానికి ఇనుప రాడ్లను ఉపయోగించకుండా చెక్క, ప్లాస్టిక్‌తో చేసిన పైపులను మాత్రమే వాడాలి.
4.చెట్ల కొమ్మలపై, వాహనాలపై, ఇతర భవనాలపై తెగి పడ్డ తీగలు ఉంటే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
5.భారీ గాలులు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్‌కి తెలియజేయాలి.
6.విద్యుత్ అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్‌కు సంప్రదించే వినియోగదారులు తమ బిల్లు పై ముద్రితమైన యూఎస్‌సి నెంబర్ ను సిద్ధంగా ఉంచుకోవాలి.
7.లోతట్టు ప్రాంతాలు, ముంపునకు అవకాశమున్న ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు వెంటనే తమ సిబ్బందికి తెలియజేయాలి.
విద్యుత్‌కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912/100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సిఎండి తెలియచేశారు. దీనికి తోడు సంస్థ మొబైల్ ఆప్, వెబ్‌సైట్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకురాగలరని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమా రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News