Sunday, December 22, 2024

ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక కరోనా వార్డు

- Advertisement -
- Advertisement -

వరంగల్: దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN-1 వేగంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం వైద్యులు అప్రమత్తమైయ్యారు. ఎంజీఎం ఆసుపత్రి సూపర్డెంట్ చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో 50 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామన్నారు. 70కిపైగా కోవిడ్ వెంటిలెటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారన్న ఆయన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భూపాలపల్లి జిల్లా కు చెందిన 65 సంవత్సరాల వృద్ధురాలు కరోనా లక్షణాలతో ఎంజీఎంలో చేరినట్లు ఆయన వెల్లడించారు. మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రశేఖర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News