ముంబయి: క్రూయిజ్‌షిప్ డ్రగ్స్ కేసులో మరో 9 మంది నిందితులకు ఎన్‌డిపిఎస్ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిలో డ్రగ్స్ సరఫరాలో కీలకపాత్రధారిగా ఆరోపణలున్న ఆచిత్‌కుమార్ కూడా ఉన్నారు. అక్టోబర్ 2న క్రూయిజ్‌షిప్‌పై దాడి జరిపిన ఎన్‌సిబి అధికారులు డ్రగ్స్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 20 మంది అరెస్ట్ కాగా, ఇప్పటివరకు 14మందికి బెయిల్ లభించింది. శనివారం బెయిల్ లభించినవారిలో ఆచిత్‌తోపాటు నూపూర్ సతీజా, గోమిత్‌చోప్రా, గోపాల్జీ ఆనంద్, సమీర్‌సెహ్‌గల్, మానవ్ సింఘాల్, భాస్కర్ అరోరా, శ్రేయస్ నాయర్, ఇష్మీత్‌సింగ్ ఉన్నారు. ఒక్కొక్కరూ రూ.50,000 నగదు పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యేందుకు ప్రత్యేక కోర్టు వీలు కల్పించింది. సాక్ష్యులను ప్రభావితం చేయొద్దంటూ పలు షరతులు విధించింది. మరో ఇద్దరికి కూడా ప్రత్యేక కోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో బాంబే హైకోర్టు ద్వారా ఆర్యన్‌ఖాన్‌తోపాటు మరో ఇద్దరు శుక్రవారం బెయిల్ పొందారు.