Saturday, January 25, 2025

నవనీత్, రవి రాణా బెయిల్ ను రద్దు చేయాలన్న పోలీసుల వినతిని తిరస్కరించిన కోర్టు

- Advertisement -
- Advertisement -

 

Navneet bail

ముంబై: బెయిల్ షరతులను ఉల్లంఘించారంటూ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ముంబై పోలీసులు దాఖలు చేసిన దరఖాస్తును ముంబైలోని ప్రత్యేక కోర్టు సోమవారం తిరస్కరించింది. ప్రత్యేక న్యాయమూర్తి ఆర్‌కె రోకడే మాట్లాడుతూ నిందితుల ఆరోపణల వల్ల కేసు మెరిట్‌లు ప్రభావితం కానట్లయితే, వారి బెయిల్‌ను రద్దు చేయలేమని అన్నారు.

ఆ జంటను ఏప్రిల్ 23న అరెస్టు చేసి, మే 4న వారికి బెయిల్ మంజూరు చేశారు. వారికి బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు విధించిన షరతుల్లో కేసుకు సంబంధించిన విషయాలపై పత్రికా ముఖంగా మాట్లాడకూడదని ఆదేశించింది. షరతులను ఉల్లంఘిస్తే వారి బెయిల్‌ను రద్దు చేయవలసి ఉంటుందని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News