Monday, December 23, 2024

ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్‌కు ప్రత్యేక కోర్టు నిరాకరణ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ, జేడీ(ఎస్) బహిష్కృత నేత ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ అభ్యర్థనను ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక ప్రజాప్రాతినిధ్య కోర్టు బుధవారం నాడు తోసిపుచ్చింది.

హోలెనరసిపుర పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ప్రజ్వల్ ఆయన తండ్రి హెచ్‌డి రేవణ్ణ నిందితులుగా ఉన్నారు. లైంగిక నేరాల కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్ ) కస్టడీలో ప్రస్తుతం ప్రజ్వల్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News