Sunday, December 22, 2024

మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం: గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్‌లో భాగంగా మహిళల సమస్యలను గవర్నర్ తమిళిసై విననున్నారు. ప్రస్తుతం సమాజంలో మహిళల సమస్యలు, వారి అభిప్రాయాలను ఈ కార్యక్రమంలో పంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 04023310521 నెంబర్‌కి ఫోన్ చేయాలని సూచించాచరు. అలాగే రాజ్‌భవన్ అధికారిక మెయిల్ ఐడి రాజ్‌భవన్‌హెచ్‌వైడి@.జివోవి.ఇన్‌కు మెయిల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవాలని కోరారు.

Special Darbar for Women at Raj Bhavan: Tamilisai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News