- Advertisement -
అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమా దేవి(50) మృతి చెందారు. సోమవారం ఉదయం జిల్లాలోని సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -