Sunday, December 22, 2024

ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ టౌన్‌లో ట్రాఫిక్ ఇంచార్జీ ఆర్‌ఎస్‌ఐ రమేష్ , ట్రాఫిక్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, మైనర్లకు కౌన్సిలింగ్ చేసి, హెల్మెట్ లేనివారికి, ట్రిపుల్ రైడ్ చేసేవారికి ఫైన్ , డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినవారిని కోర్ట్‌కి పంపించడమైంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్‌ఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపటం వలన ఆక్సిడెంట్స్ అవుతవి అప్పుడు నడిపే వారి కుటుంబం అవతల వారి కుటుంబం ఇబ్బందుల పాలవుతారని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ప్రజలకు సూచించారు. మైనర్లకు కూడా వాహనాలు ఇచ్చి బయటకు పంపకూడదని తల్లిదండ్రులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News