Friday, November 22, 2024

గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రత్యేక డ్రైవ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్య మెరుగుపరిచేందుకు ఈనెల 7 నుంచి 15వ తేదీవరకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది.శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ నుం చి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనపై పలు సూ చన లు చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబం ధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌లో ప్రజలను, యువతను, మహిళలను భాగస్వామ్యం చే స్తూ గ్రామాలను అద్దంలా తయారు చేయా లని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయా లు,రోడ్లను శుభ్రం చేయాలని, పిచ్చి మొ క్కలను తొలగించాలని, ఓవర్ హెడ్ ట్యాం కులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ప్లా స్టిక్ నిషేధంపై ప్రజలందరిని భాగస్వామి చే స్తూ అవగాహన కల్పించాలని, మధ్యం, గం జాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే వచ్చే నష్టాలపై అవగాహన సైతం కల్పించాలని సూచించారు. చివరి రోజున గ్రామసభ నిర్వహించాలని, పారిశుద్ధ కార్మికులకు సన్మానించాలని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, రాబోయే వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెక్తకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని కోరారు. ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారు నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించుకొని, గ్రామ పంచాయతీ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కోటి రూపాయలు నిధులు కేటాయించిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ డైరెక్టర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News