Sunday, December 22, 2024

రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్: ఎక్స్ లో కాంగ్రెస్ పోస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రైతులకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘అర్హత ఉన్నా రుణమాఫీ కానీ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆధార్‌లో తప్పులుంటే దానికి బదులుగా ఓటరుకార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే నిర్వహిస్తారు. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే సరిచేసే పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు అసలు, వడ్డీ లెక్కలు సరిపోకపోతే నిర్ధారణ, దిద్దుబాటు చర్యలు, ఇంటింటికీ వెళ్లి ఫిర్యాదుల స్వీకరణ చేపట్టేలా కొత్తగా మార్గదర్శకాలు జారీ’ అని కాంగ్రెస్ పోస్ట్ చేసింది.

రాష్ట్రంలో మూడో విడతలో రెండు లక్షల రైతు రుణమాఫీ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. 14.45 లక్షల మంది రైతులకు మూడో విడతలో రాష్ట్ర ప్రభుత్వం రుణాలు విడుదల చేసింది. ఆగష్టు 15వ తేదీన నిధులు విడుదల చేసినా ఇంకా కొంతమందికి రుణమాఫీ కాలేదని రైతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News