Monday, January 20, 2025

దడ పుట్టిస్తున్న రవాణాశాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్ : త్రైమాసిక ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న ట్రాన్స్‌పోర్టు వాహనాల నిర్వాహకుల గుండెళ్ళలో రవాణాశాఖ అధికారులు రైళ్ళు పరుగెత్తిస్తున్నారు. 9 త్రైమాసికాల ( క్వార్టర్లీ ట్యాక్స్‌లు ) పన్నులు చెల్లించకుడా గ్రేటర్‌లో 16,814 ట్రాన్స్‌పోర్టు వాహనాలు తిరుగుతున్నాయని వాటి ద్వారా సంస్థకు సుమారు రూ.17.68 కోట్లు ఫైన్‌లతో కలిపి రావాల్సి ఉంది( ట్యాక్స్‌లు ః12.37 కోట్లు, ఫైన్‌లు రూ.5.31 కోట్లు). వీటి వసూళ్ళ కోసం రవాణశాఖ అధికారులు సుమారు ఒక నెల రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం పోరుగు జిల్లా నుంచి ప్రత్యేకంగా డిప్యూటేషన్ మీద ఎంవిఐ అధికారులు రప్పించి మరీ నిర్వహిస్తున్నారు.

ఒక్కో ఎంవిఐ అధికారికి సుమారు రూ. 5 నుంచి 8 టార్గెట్లు పెటినట్లు సమాచారం. ఈ స్పెషల్ డ్రైవలో కొద్ది మొత్తం ఉన్న వారు వెంటనే సమీప రవాణశాఖ కార్యాలయాలు, ఈ సేవా సెంటర్లు, ఆన్‌లైన్‌ల సదరు మొత్తాన్ని చెల్లిస్తుంటే, భారీమొత్తంలో ఫైన్‌లు ట్యాక్స్‌లు చెల్లించాల్సిన వారు మాత్రం సదరు తమ వాహనానలు అక్కడే వదిలివేస్తున్నారు. తాము చెల్లించాల్సిన ట్యాక్స్ కంటే అధికారులు విధించే ఫైన్ 200 శాతం అధికంగా ఉందని ఇదేమి న్యాయమని వారు ప్రశ్నిస్తుంటే మరి కొంత మంది తాము నడుపుతన్న వాహనం కంటే అధికారులు వసూలు చేస్తే ట్యాక్స్‌లు అధికంగా ఉన్నాయంటున్నారు.

200 శాతం ఫైన్ అన్యాయం 

సాధారణంగా అధికారులు విధించే ఫైన్ 5 శాతం లేదా 10 శాతం ఫైన్ ఉంటాయి కాని, ఎన్నడూ లేని విధింగా అధికారులు 200 శాతం ఫైన్ పేరుతో తమ ఉపాధిపై దెబ్బకొడుతున్నారని అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు పెరిగిన డీజిల్,పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతూ బతుకు భారంగా వెళ్ళదీస్తున్నామని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. వాహనానికి సంబంధించిన నెలసరి కిస్తీలు, చెల్లించుకుంటూ , మార్కెట్‌లో కాంపీటీషన్‌తో ఆర్దికంగా ఇబ్బంది పడుతున్నామంటున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో అధికారులు సీజ్ చేస్తున్న వాహనాలు అమ్మినా అంత మొత్తం రాదంటున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తాము కూడా కీలక పాత్రపోషించామని అసోసియేషన్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు వాహనాలు నడిపేవారిలో అధికంగా పేద వాళ్ళు ఉన్నారని, ఉన్న ఫళంగా త్రైమాసిక ట్యాక్స్ ఫైన్‌తో సహా కట్టాలంటే ఎక్కడ నుంచి తీసుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు చేస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను వెంటనే ఆపడమే కాకుండా
200 శాతం ఉన్న ఫైన్ పూర్తిగా తగ్గించడమే కాకుండా త్రైమాసి ట్యాక్స్ చెల్లించేందు కొంత గడువు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.అధికారులు నిర్వహిస్తున్న దాడులను ఆపక పోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News