Saturday, April 5, 2025

గంజాయిపై సైబరాబాద్‌లో స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

Special drive on cannabis in Hyderabad

 

హైదరాబాద్ : నిషేధిత గంజాయిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9.87 కిలోల గంజాయి, 13 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై పిడి యాక్ట్ పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్, గంజాయి గురించి తెలిసిన వారు సైబరాబాద్ ఎన్‌డిపిఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ నంబర్ 7901105423, వాట్సాప్ నంబర్ 9490617444కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News