Monday, December 23, 2024

సైబరాబాద్ లో ‘స్టాప్ లైన్ ఉల్లంఘన‘ల పై స్పెషల్ డ్రైవ్ షురూ..

- Advertisement -
- Advertisement -

Special drive on 'stop line violations' in Cyberabad

మనతెలంగాణ/హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం నుంచి స్టాప్ లైన్ ఉల్లంఘనలపై స్పెషల్ ప్రారంభమైంది. ఈ స్పెషల్ డ్రైవ్ ను విప్రో సర్కిల్ వద్ద సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి టి.శ్రీనివాస రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో పాదచారుల భద్రత దృష్ట్యా నుంచి స్టాప్ లైన్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్‌ను చేపడుతున్నమన్నారు. సిగ్నల్ పడిన తర్వాత స్టాప్ లైన్ దాటి జీబ్రా క్రాసింగ్ లేదా అంతకంటే ముందు వాహనాలు ఆపుతారో వారిపై మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 177 ప్రకారం రూ.100 రూపాయల జరిమానా విధించనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే పాదచారులు కూడా జీబ్రా క్రాసింగ్ల వద్దనే రోడ్డు దాటాలని సూచించారు.ఈ డ్రైవ్ లో ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ హనుమంత రావు,గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ నవీన్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News