Sunday, December 22, 2024

నేటి నుంచి రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్‌పై స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : గత కొంత కాలం నుంచి ట్రాఫిక్‌పై దృష్టి సారించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. నగరంలో రోప్ కార్యక్రమం విజయవంతం కావడంతో ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్, ట్రిపుల్ రైడ్‌పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఈ నెల 28వ తేదీ నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలోనే ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్‌పై ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై అక్కడికక్కడే జరిమానా విధించడమే కాకుండా చర్యలు తీసుకోనున్నారు. ట్రాఫిక్ పోలీసులు లేరని సిగ్నల్ జంప్ చేసినా సిసి కెమెరాల్లో చూసి జరిమానాలు విధించనున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News