- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలోని 14 జలపాతాలపై తెలంగాణ పర్యాటకాభివృద్ధి శాఖ దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఒక్కో జలపాతం నుండి లక్షల ఆదాయం వస్తుండడంతో ఈ ఆదాయాన్ని కోట్లలోకి చేర్చేందుకు యత్నిస్తోంది. ఈ జలపాతాల ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు ఇంకా ఏమేం చేయాలి? ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చు? చేస్తే పర్యాటకులు ఏ మేరకు ఆదరణ ఉంటుంది తదితర అంశాలపై పర్యాటకాభివృద్ధి శాఖ క్షేత్రస్థాయి నుండి సమాచారం తెప్పించుకుని తదనుగుణంగా నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఈ జలపాతాలు వర్షాకాలం మొత్తం పర్యాటకులతో కిటకిటలాడే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పర్యాటకాభివృద్ధి శాఖ (టిఎస్ టిడిసి) ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు తరుచూ సమీక్షలు చేసుకుంటూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుండడం విశేషం.
- Advertisement -