Thursday, January 9, 2025

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -
  • పారా మిలిటరీ దళాల ప్లాగ్ మార్చ్ జెండాను ప్రారంభించిన ఎస్పీ

కాగజ్‌నగర్: రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి వర్గ విబేధాలు లేకుండా అల్లర్లు జరగకుండా ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎన్‌టిఆర్ చౌక్ వద్ద పారా మిలిటరీ దళాల ప్లాగ్ మార్చ్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పారా మిలటరీ దళాలతో కలిసి పట్టణంలోని లారీ చౌక్, రాజీవ్‌గాంధీచౌక్, మార్కెట్ ఏరియాల వీధుల గుండా కవాతులో పాల్గొన్నారు. అనంతరం పారా మిలిటరీ దళాల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించి వారికి ఎన్నికలకు సంబంధించి తగు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచించిన గైడ్‌లైన్స్ ప్రకారం విధులు నిర్వహించాలని, రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలో మొత్తం 597 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇందులో నార్మల్ పోలింగ్ కేంద్రాలు 432, క్రిటికల్ పోలింగ్ 92, ఎల్‌డబ్లుఈ పోలింగ్ 73 గా గుర్తించడం జరిగిందని అన్నారు.

ఎవరైనా చట్ట విరుద్ద్ధంగా ప్రవర్తించిన, గోడవలు సృష్టించాలని సూచించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా ఎలక్షన్ సమయంలో పోలీసులకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డిఎస్‌పి కరుణాకర్, సిఐలు స్వామి, నాగరాజు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News