Sunday, December 22, 2024

పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:పోలింగ్ కేంద్రాల క్ర మబద్దీకరణ వేగంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ పై గు ర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ని యోజకవర్గాల వారీగా వివిధ అంశాల పై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పేర్ల మార్పు అలాగే పాత పోలింగ్ కేంద్రాల మార్పుల పై రాజకీయ పా ర్టీల ప్రతినిధులతో ఏమైనా తమ అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలనకు టీమ్స్ పంపించి వాటి యొక్క స్థితిగతుల పై సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని, ఓటర్ సవరణ జాబితా పూర్తి స్థాయిలో ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, తహశీల్దార్ వెంకన్న, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News