Wednesday, January 22, 2025

తెలంగాణలో గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లిలో రెండు కోట్ల నిధులతో అంబేద్కర్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, నేడు మరో రెండు కోట్ల ఖర్చుతో గిరిజన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ ప్రాంతంలో మైనార్టీని రిజిస్టర్ పాఠశాల దోబిఘాట్‌ను ఏర్పాటుచేయడం జరుగుతుందని తెలిపారు. గిరిజన ఆదివాసీల చిరకాల ఆకాంక్ష నెరవేరుస్తూ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేసిందని, ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శిని నియమి స్తూ స్మశానవాటిక, కంపోస్టు షెడ్డు, డంపింగ్ యార్డు నర్సరీ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఏర్పాటుచేసిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.25లోల చొప్పుల నిధులు మంజూరు చేసిందని త్వరలో వాటి పనులు పూర్తి చేసే అందుబాటులోకి తెస్తామని అన్నారు.

గతంలో గిరిజన ఆవాసాలలో త్రాగునీటికి తీవ్ర కష్టాలు ఉండేవని ప్రస్తుతం వాటిని పరిష్కరిస్తూ ఇంటింటికి నల్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని, గిరిజన గ్రామాలలో సిసి రోడ్లు, డ్రైన్‌లు మొదలగు పనులు పూర్తి చేస్తామని అన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లను సిఎం కెసిఆర్ 6 శాతం నుండి 10 శాతానికి పెంచారని తెలిపారు. పోడు పట్టాల సమస్యను ప్రభుత్వం పరిష్కరించే త్వరలో గిరిజనులకు పట్టాల పంపిణీ ఉంటుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి ట్రైబల్ ఏరియాలలో విధులు నిర్వహిస్తున్నానని, భద్రాద్రి కొత్తగూడెం ఉట్నూరు, భూపాలపల్లి జిల్లాలలో పనిచేశానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోయా, గోండు, లంబాడి, ఆదివాసీ, ఎరుకల మొదలగు 12తెగలకు చెందిన గిరిజనులు ఉన్నారని ఆయన అన్నారు.

ప్రజల చికాల ఆకాంక్షను నెరవెరుస్తూ ప్రభుత్వం తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని, భూపాలపల్లి జిల్లాలో 17 నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో జిల్లాలో 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులను సన్మానించడం జరిగిందన్నారు. ముఖ్య అతిథులను కుల సంఘాల నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జిల్లా ప్రజా పరిషత్ సిఈఓ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకట్రామిరెడ్డి, పరిషత్ వైస్ చైర్‌పర్సన్ కేశవ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ హరిబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి రమేష్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News