మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: కొంత మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వలన పాదాచారులతో పాటు వాహనదారులను ప్రమాదంలోకి పడిపోతున్నారు. రాంగ్ రూట్లలో వాహనాలు వెళ్లడం తప్పని తెలిసినా గమ్యస్థానాలకు త్వరగా వెళ్లేందుకు, పెట్రోలు ఆదా చేసుకోవడానికి రాంగ్ రూట్లలో ప్రయాణిస్తున్నారు. చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లను వంచడం, ఏవైనా అడ్డుపెట్టడం చేస్తున్నారు. గద్వాల ట్రాఫిక్ ఎస్‌ఐలు విక్రమ్, విజయ్ ఆధ్వర్యంలో రాంగ్ రూట్ వెళ్లే వాహనదారులపై ప్రత్యేక దృష్టిసారించారు. రాంగ్ రూట్ వెళ్లే వాహనాలకు చలాన్లు విధించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐలు మాట్లాడుతూ వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్లడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతి 50, 100 మీటర్ల యూటర్నులు పెట్టామని దూరంలో వాహనాలు రాంగ్ రూట్ వెళ్లకుండా యూటర్న్ వినియోగించుకోవాలన్నారు. వాహనదారులు సిగ్నల్ పడినా కొందరూ ఆగకుండా వెళ్తున్నారని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తప్పకుండా పాటించాలని సూచించారు. ప్రయాణికులు, వాహనదారుల క్షేమం కోసం ట్రాఫిక్ పోలీసులు నిరంతరం సూచనలు అందిస్తున్నారని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, గద్వాల పోలీసులకు సహకరించాలని కోరారు.
రాంగ్ రూట్… వాహనాదారులపై స్పెషల్ ఫోకస్
- Advertisement -
- Advertisement -
- Advertisement -