Thursday, January 23, 2025

మాతా శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: జిల్లాలో మాత శిశు మరణాల నియంత్రణపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ చా హత్‌భాజ్‌పాయ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యాధికారులతో మాత శిశు మరణాల నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మారుమూల గ్రా మాలలో వర్షాకాలం కారణంగా రాకపోకలకు ఇబ్బంది ఎదురయ్యే నేపథ్యంలో ఆయా గ్రామాలలో ఉండే గర్భిణుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

హైరిస్క్ ఉన్న గర్భీణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలంలో రోడ్లు తగ్గిపోయి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే గ్రామాలకు సంబంధించి ప్రతి నెల 3వ శనివారం మండల పరిషత్ అభివృద్ధ్ది అధికారులతో జరిగే సమావేశానికి స ర్పంచ్‌లు, ఎంపిపిలు హాజరవుతారని, గ్రామాల వివరాలను సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు.

మాత శిశు మరణాలు సంభవించకుండా క్రమం తప్పకుండా గర్భిణులకు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News