Wednesday, January 22, 2025

విద్యా, వైద్యానికి ప్రత్యేక నిధులు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి :విద్యా, వైద్యరంగానికి గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని మంత్రి సబితారెడ్డి పెర్కొన్నారు. మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాఖల వారిగా సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని పెర్కొన్నారు.

కంటి వెలుగు క్రింద పరీక్షలు నిర్వహించి ఆపరేషన్‌లు చేపట్టడం జరిగిందన్నారు. ఆరోగ్య మహిళ ద్వారా ప్రతి మంగళవారం కేవలం మహిళలకు పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందచేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానలు ప్రారంబించి పేదలకు మెరుగైన వైద్యం అందచేస్తున్నామన్నారు. సమస్యలు ఎక్కడ ఉన్న ప్రభుత్వం వాటి పరిష్కారం కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందన్నారు. మన ఊరు మన బడి ద్వారా జిల్లాలోని 464 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థ్దులకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. తలకొండపల్లి, మంచాల తదితర మండలాల్లో ఉపాధ్యాయుల కొరతపై స్థానిక జడ్పీటిసిలు వెంకటేష్, నిత్య నిరంజన్ రెడ్డిలు సభ దృష్టికి తీసుకురావడంతో తక్షణం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు పడుతున్న కష్టాలను స్థానిక జడ్పీటిసి వెంకటేష్, ఎంపిపి నిర్మల సభ దృష్టికి తేవడంతో ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని తక్షణం ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది కొరత, సౌకర్యాల కొరతపై పలువురు సభ్యులు సభ దృష్టికి తేవడంతో వాటి పరిష్కారంకు చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో తరుచు రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని వాటి నివారణకు చర్యలు చేపట్టాలని ఆర్‌ఆండ్‌బి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. జడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారులు జడ్పీ సమావేశంకు తప్పనిసరిగా హజరవ్వాలన్నారు. జిల్లాలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారంకు చర్యలు చేపట్టాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News