Monday, January 20, 2025

ఎస్‌ఐ, కానిస్టేబుల్ సాధించండిలా..!

- Advertisement -
- Advertisement -

Special Interview with Ramappa Academy Director Ailee Vamsi Krishna

ఎస్‌ఐ, కానిస్టేబుల్ సక్సెస్ మంత్రా..

ఇటీవల విడుదలైన పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నిరుద్యోగ యువతలో నూతన ఉత్సాహాన్ని నింపింది. నోటిఫికేషన్ల జారికి పలు రకాల అడ్డంకులు ఎదురైనా..అన్నింటిని అధిగమించి ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల ప్రకటన విడుదల చేసింది. లక్షల మంది అభ్యర్థులు పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. లక్షల మంది పోటీ పడే ఈ ఉద్యోగాలను ఎలా సాధించాలి? ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఎలా ప్రిపేర్ కావాలి..ఎలాంటి మెళకువలు పాటించి ఉద్యోగం సొంతం చేసుకోవాలో తెలుసుకుందాం..

రామప్ప అకాడమీ డైరెక్టర్ ఐలీ వంశీకృష్ణతో స్పెషల్ ఇంటర్వూ..

పోలీసు ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యం జరగడంతో..ఎక్కువ మంది అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉండేలా ప్రభుత్వం వయోపరిమితిలో సడలింపులు ఇచ్చింది. ప్రభుత్వం వయో పరిమితిలో తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల మీద గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా అవగాహన పెరిగింది. దాని వలన డిగ్రీ మొదటి ఏడాది చదివే విద్యార్థులు సైతం కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

మూడంచెల విధానంలో సెలక్షన్:

ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకి ౩ అంచెల విధానంలో సెలక్షన్ ఉంటుంది. విద్యార్థులు ఉద్యోగం సాదించాలంటే తప్పక మూడు విభాగాల్లో అర్హత సాధించాలి.
అవి

1. ప్రిలిమ్స్

2. ఫిజికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్

3. మెయిన్ పరీక్ష

గమనిక:

మెయిన్ పరీక్షలో సాధించే మార్కుల ఆధారంగా మెరిట్ చూస్తారు. మెయిన్ పరీక్షలో కటాఫ్ మార్కు ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.

సిలబస్ ఆధారంగా ప్రిపరేషన్ :

పోలీసు ఉద్యోగాల సాధనకు విద్యార్థులు ముఖ్యంగా సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇప్పటికే అభ్యర్థులు ప్రిపరేషన్ పరంగా విజయం సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రణాళికలని విజయానికి చేరువయ్యే విధంగా ప్రిపేర్ చేసుకుంటే విద్యార్థులు పోలీసు ఉద్యోగాన్ని సునాయాసంగా సాధించవచ్చు.

ముఖ్యమైన టాపిక్స్‌పై ఫోకస్ పెట్టాలి:

రాత పరీక్షకు ప్రిపేరయ్యే విద్యార్థులు సిలబస్ ప్రకారం ప్రిపరేషన్ ను కొనసాగించాలి. సిలబస్‌లో ముఖ్యంగా ఇచ్చిన అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, హిస్టరి, పాలిటి, ఎకానమీ, జాగ్రఫీ, తెలంగాణ అంశాలతోపాటు తెలంగాణ ఉద్యమంపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. సిలబస్ లోని అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ నుంచే అత్యధిక మార్కులు సాధించే వీలుంది. అందుకే ముఖ్యమైన టాపిక్స్‌పై ప్రాక్టిస్ ఎక్కువగా చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ పూర్తి చేసుకునే వీలుంది. అలాగే తెలంగాణ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటి కూడా పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి. పోటీ పరీక్షల్లో ప్రిపరేషన్ అంటే కేవలం చదవటమే కాదు, చదివింది పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకునేలా ఉండాలి. అందుకోసం ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ప్రీవియస్ పేపర్లను బాగా అనాలసిస్ చేసి ప్రశ్నల నాడి తెలుసుకోవాలి. పూర్వ ప్రశ్నా పత్రాల ఆధారంగా ఇప్పుడు ఎటువంటి ప్రశ్నలు వస్తాయి అనే అంచనాతో ముదుకెళ్లాలి.

ముఖ్యమైన టాపిక్స్ ఇవే:

అర్థమెటిక్

రీజనింగ్

జనరల్ నాలెడ్జ్

కరెంట్ అఫైర్స్

హిస్టరీ

పాలిటీ

ఎకానమీ

జాగ్రఫీ

తెలంగాణ అంశాలు

తెలంగాణ ఉద్యమం

ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఒకే ప్రిపరేషన్:

ప్రిలిమినరీ పరీక్ష అనేది క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే..దీనిలో అర్హత మార్కులు సాధించినా సరిపోతుంది. కాని మెయిన్స్ పరీక్ష మాత్రం అలా కాదు, ఖచ్చితంగా మెరిట్ సాధించాలి. అందుకే ముందునుంచే ప్రిపరేషన్ కఠోరంగా చేయడం వల్ల ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించడమే కాకుండా మెయిన్ పరీక్షలో కూడా మంచి మెరిట్ సాధించి పోలీస్ ఉద్యోగం సాధించవచ్చు.

ప్రతిరోజు చదివింది, క్లాస్ విన్నవి అదేరోజు చదవటం వల్ల బాగా గుర్తుంటుంది. దానికి తోడు అదే అంశంపై బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది.

ఇటీవల కాలంలో ఆన్‌లైన్ పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. అభ్యర్థులు ప్రిపరేషన్‌తోపాటు మాక్ టెస్ట్‌లు ప్రాక్టీసు చేయాలి. మాక్ టెస్టుల వల్ల పరీక్షలో కేటాయించిన సమయంలోనే సమాధానాలు గుర్తించగలుగుతున్నామా..లేదా అనేది స్పష్టమవుతుంది.

ఈ ఏడాది ప్రిలిమ్స్ పరీక్షకి నెగిటివ్ మార్క్‌లున్నాయి. నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి 5 తప్పు సమాధానాలకు గాను ఒక్క మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు,ఇంగ్లిష్, ఉర్థు భాషల్లో ఇస్తారు. ప్రిలిమినరీ పరీక్ష200 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో 60 మార్కులు సాధించిన వారంతో ప్రలిమ్స్ క్వాలిఫై అవుతారు. నెగిటివ్ మార్కులు ఉంటాయి.

సమయపాలనతోనే సక్సెస్ :

ప్రిపరేషన్ లో టైమ్ మేనేజ్ మెంట్ చాలా ముఖ్యం. అభ్యర్థులు ఖచ్చితమైన సమాధానాన్నే ఎంచుకోవాలి. సమయపాలన చేసుకుంటే మెయిన్స్ పరీక్షలో రాణించవచ్చు. ప్రిలిమినరీ క్వాలిఫై అయినవారందరూ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌కు అర్హత సాధిస్తారు. ఫిజికల్ టెస్టుల్లో కూడా క్వాలిఫైతో పాటు మెరిట్ కూడా తెచ్చుకునేలా ఉండాలి.

ఈవెంట్స్ ఇలా :

1600 మీల పరుగు 7ని.15సెకన్లలో పురుష అభ్యర్థులు పూర్తి చేయాలి. మహిళలు 800మీటర్ల పరుగు పందెంను 5ని. 20సెకన్లలో పూర్తి చేయాలి.

లాంగ్‌జంప్ పురుషులకు 4 మీటర్లు, మహిళలకు 2.50 మీటర్లు ఉంటుంది.

షాట్‌పుట్ పురుషులకి 7.26kg బరువుగల షాట్‌పుట్ 6 మీ విసరాల్సి ఉంటుంది. మహిళలైతే 4kg బరువుగల షాట్‌పుట్ 4మీ విసరాలి.

పురుషుల ఎత్తు 167.6 సెం.మీ ..మహిళలకు ఎత్తు 152.5 సెం.మీ గాను ఉంటుంది.

గ్రౌండ్ ప్రాక్టీస్‌తోపాటే ప్రిపరేషన్:

మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. ఫైనల్ పరీక్షలో ఎటువంటి నెగిటివ్ మార్కులు లేవు. మెయిన్ పరీక్షలో ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు కేటాయించారు. మొత్తం 200 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ౩ గంటల సమయం కేటాయిస్తారు. మినిమమ్ కటాఫ్ మార్క్‌గా జనరల్ అభ్యర్థులకు 40 శాతం మార్కులు, ఓబీసీ వారికి 35 శాతం మార్కులు, ఎస్సీ,ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ౩౦శాతం మార్కులు ఉంటాయి.

రోజు ఉదయం, సాయంత్రం గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. జనరల్ టైమింగ్‌లో రాతపరీక్షకు ప్రిపరేషన్ చేసుకోవాలి. మాక్‌టెస్ట్‌లు సాధ్యమైనన్ని ప్రాక్టీసు చేసుకోవాలి. సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుని సరైన మెటీరియల్ ఎంపికచేసుకుని ఒకటికి పది సార్లు ప్రాక్టీసు చేయాలి. గ్రూప్ డిస్కషన్స్ చేయడం ద్వారా అంశాలు బాగా గుర్తుంటాయి. ఇలా ప్రిపరేషన్ చేస్తే ఎస్‌ఐ లేదా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించవచ్చు.

ప్రిలిమినరీ                                                                              మెయిన్స్ పరీక్ష

క్వాలిఫైయింగ్

మార్కులు                నెగిటివ్ మార్కులు                                   క్వాలిఫైయింగ్ మార్కులు    నెగిటివ్ మార్కులు

S.I 60 (అన్ని కేటగిరీలు)     1/5                                             oc– 40%, obc 35%             1/4
sc/st/ex service- 30%

p.c 60 (అన్ని కేటగిరీలు)    1/5                                          oc- 40%, obc 35%— నెగిటివ్ మార్కులు లేవు
sc/st/ex service- 30%

ఎస్‌ఐ మెయిన్స్ పరీక్షా విధానం:

పేపర్                                             సబ్జెక్టు                                                   గరిష్ట మార్కులు

                                                                                     (civil,fire,dy jailor) (ar,tssp,spf)

పేపర్ 1                                         ఇంగ్లిష్                                        100                       100

పేపర్ 2                                       తెలుగు/ఉర్ధూ                                    100                    100

పేపర్ ౩                                      అర్థమెటిక్,రీజనింగ్,మెంటల్‌ఎబిలిటీ                  200                  100

పేపర్ 4                                        జనరల్ స్టడీస్                                      200                 100

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News