ముంబై కస్తూర్బా ఆస్పత్రిలో ఏర్పాటు
ముంబై: మంకీపాక్స్ కేసులు కొన్ని దేశాలలో బయటపడుతున్న దరిమిలా ముంబైలోని కసూర్తా ఆసుపత్రిలో అనుమానిత రోగుల ఐసోలేషన్ కోసం 28 పడకల వార్డును సిద్ధం చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. నగరంలో ఇప్పటివరకు మంకీపాక్స్‌కు సంబంధించి అనుమానిత లేదా నిర్ధారిత కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం తెలిపింది. మంకీపాక్స్ కేసులు నమోదైన దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారని బిఎంసి తెలిపింది. అనుమానిత రోగులను ఐసోలేషన్‌లో ఉంచేందుకు వీలుగా కస్తూర్బా ఆసుపత్రిలో 28 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు బిఎంసి తెలిపింది. అనుమానిత రోగుల నుంచి నమూనాలను సేకరించి టెస్టింగ్ కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతామని తెలిపింది.