- Advertisement -
అమరావతి: అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అందుకోసం ప్రత్యేకంగా ఈగల్ టీంను ఏర్పాటు చేశామన్నారు. ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే తప్పించుకోలేరనన్నారు. మత విద్వేషాలు లేని వాతావరణం ఉండాలని కోరారు. ముఠాలు, కుమ్ములాటలు ఇక చెల్లవని, రాష్ట్రంలో రౌడీలు ఉండడానికి ఇక వీల్లేదని తెలియజేశారు. రౌడీయిజం చేసి తప్పించుకుంటామంటే కుదరదని కరాఖండిగా చెప్పారు. ఇక భూమి విషయాని కొస్తే భూ కబ్జాలకు పాల్పడే వారిని హెచ్చరిస్తూ…భూకబ్జాలపై ప్రత్యేక చట్టాలున్నాయని, గుజరాత్ అమలు చేస్తోందని వెల్లడించారు. భూ కబ్జాలు నియంత్రించేలా చట్టాన్ని తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
- Advertisement -