Thursday, January 23, 2025

మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక రుణాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉన్నవారికి స్త్రీ నిధి నుంచి ప్రత్యేక రుణాలు వివిధ పథకాల కింద అందజేయనున్నట్లు స్త్రీ నిధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జి ఇందిర తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ సువిధ, ప్రగతి, అక్షయ, సౌభాగ్య పథకాల కింద రూ.3 లక్షల వరకు స్త్రీ నిధి ప్రత్యేక రుణాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు మూడు లక్షలు,ల్యాప్‌టాప్ రూ.35 వేలు, కోడి పిల్లల పెంపకానికి రూ. 2 లక్షల 91 వేల రూపాయలు, పెరటి కోళ్లు పెంపకం కోసం 22,000 రూపాయలు, కొత్త ద్విచక్ర వాహన కొనుగోలు కోసం 75 వేల రూపాయలు, ఇంటి మరమ్మత్తుల కోసం 75 వేల రూపాయలు, జనరిక్ మెడిసిన్ దుకాణాల కోసం రూ.3 లక్షలు, చిరు వ్యాపారాల కోసం రూ.3 లక్షల వరకు రుణ సదుపాయం ఉంటుందని తెలిపారు.

గొర్రె పొట్టేలు పిల్లల పెంపకం కోసం రూ.73 వేలు, సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటుకు రెండు కిలో వాట్స్ రూ.1.25 లక్షల రుణంతో పాటు ప్రభుత్వ రాయితీని అందస్తారిన తెలిపారు. స్త్రీ నిధి సమాఖ్య ప్రారంభంలో రుణాలపై విధించిన వడ్డీ రేట్లు 14 శాతం ఉండేదని క్రమేనా వడ్డీ రేట్లు తగ్గించి ప్రస్తుతం 11 శాతం వడ్డీ అనగా నెలకు 100 రూపాయలకు 92 పైసలు మాత్రమే వసూలు చేస్తున్నామని వెల్లడించారు. సంఘాల్లోని మహిళ సభ్యులు స్త్రీ నిధి ప్రత్యేక రుణ పథకాలను వినియోగించుకొని అభివృద్ధికి రావాలని, తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే మిగతా వారికి ఆదర్శంగా నిలువాలని ఆమె కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News