Friday, January 17, 2025

అటవీ ప్రాంతాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

- Advertisement -
- Advertisement -
4కె  రన్‌లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి నిత్యం నడక, వ్యాయామమే మంచి ఆరోగ్యానికి మార్గమని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4కే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి పరుగు కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో నడక, సహజ ఆరోగ్య చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు నడకను అనుసరించాలని, డాక్టర్లు చెబుతున్నారని, అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడే దారి నడకే అన్నారు. పట్టణ, నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచటంతో పాటు పర్యావరణ పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ కోసం ఫారెస్ట్ బ్లాకుల్లో అర్బన్ లంగ్స్ స్పేస్ (అర్బన్ ఫారెస్ట్ పార్కులు)గా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఈ అర్బన్ పార్కుల్లో వాకర్స్ ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తుండగా, ఆహ్లాదం, ఆనందం కోసం వీకెండ్‌లో సందర్శకులు సేద తీరుతున్నారని పేర్కొన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లో ఉన్న కొత్తగూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌ను ఉమ్మడి పాలనలో వాణిజ్య అవసరాలకు లీజుకు ఇస్తే దాన్ని అడ్డుకున్న ఘనత ఆ ప్రాంత వాకర్స్‌కు దక్కుతుందని, రాష్ట్రం ఏర్పడ్డాక దాన్ని ఎకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేశామన్నాని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News