Monday, January 20, 2025

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరపాలక సంస్థ ముందస్తుగానే పకడ్డందీ చర్యలు చేపట్టిందని నగర మేయర్ వై సునీల్‌రావు అన్నారు. నగర వ్యాప్తంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్‌లో శుక్రవారం మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 33వ డివిజన్ భగత్‌నగర్‌లో మేయర్ సుడిగాలి పర్యటన చేశారు.

డివిజన్‌లో వర్షానికి కూలిన రేకుల ఇండ్లను తనిఖీ చేసి పరిశీలించారు. సంబంధిత కుటుంబ సభ్యులను పరామర్శించి నాలుగు మాసాలు అద్దె ఇంట్లో ఉండేందుకు స్వయంగా ఆర్థిక సాయం అందించారు. అనంతరం డివిజన్‌లోని పలు కాలనీల్లో పర్యటించి శిథిలావస్థకు చేరిన పలు నివాస గృహాలు, వర్షం కారణంగా ఉరుస్తున్న గృహాలను పరిశీలించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్న నివాస గృహాల కుటుంబ సభ్యులకు కూడా స్వయంగా ఆర్థిక సాయం అందించి తాత్కాలికంగా అద్దె భవనాలకు తరలించారు.

ప్రభుత్వం గృహాలక్ష్మి పేరిట నివాస గృహాల నిర్మాణంకు అందిస్తున్న మూడు లక్షల స్కీం సౌకర్యాన్నికల్పిస్తానని సంబంధిత నివాస గృహాల యజమానులకు హామీ ఇచ్చారు. అప్పటి వరకు శిథిలావస్థకు చేరిన నివాస గృహాల్లో ఉండకూడదని గృహా యజమానులను కోరారు. మరోవైపు వర్షాల కారణంగా ఉరుస్తున్న పలు నివాస గృహాలకు మేయర్ తన సొంత నిధులతో టార్పలిన్‌కవర్లను అందజేశారు. అనంతరం కాలనీల్లో ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

డివిజన్‌లో పలు కాలనీల్లో స్థానికులు మేయర్ దృష్టికి తెచ్చిన అండర్ గ్రౌండ్ డైనేజీ సమస్యలను కూడా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టేలా అధికారుల సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. నగరంలో వర్షాల కారణంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా, ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా నగరపాలక సంస్థ పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

నగరంలో ఎక్కడైనా వర్షాల కారణంగా సమస్యలు తలెత్తితే ప్రజలు వెంటనే నగరపాలకసంస్థకు సమాచారం అందించాలని కోరారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్న నగరపాలక సంస్థ అధికార సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్‌ఫోర్స్ సిబ్బంది సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News