Friday, November 22, 2024

వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు

- Advertisement -
- Advertisement -

Special medical camps in flood-prone areas

వ్యాధులు సోకకుండా స్దానిక ప్రజలకు అవగాహన
దగ్గు, జలుబు లక్షణాలు కనిపిస్తే మందుల పంపిణీ
బస్తీదవఖానలు, పీహెచ్‌సీల్లో వైద్య సేవలు, పరీక్షలు
ఐదు రోజుల వరకు జ్వరం తగ్గకుంటే ఆసుపత్రులకు వెళ్లాలని వైద్యుల సూచనలు

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న వానలకు వరద ముంపు ప్రాంతాలతో మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. రోజుకు వందలాదిమంది ఆసుపత్రుల బాట పడుతున్నారు. దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి రోగాల గురించి చెప్పేందుకు ఒక వైద్యులు, నర్సుతో పాటు స్దానికంగా ఉండే ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలతో వివరిస్తున్నారు. వ్యాధుల లక్షణాలు కనిపించగా ఆందోళన చెందకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇంటి వద్ద నయం అవుతుందని, పరిస్ధితి విషమించితే సమీపంలోని బస్తీదవఖాన, పట్టణ ఆరోగ్యకేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. గత ఐదారు రోజు నుంచి విష జ్వరాలకు పేరుగాంచిన ఫీవర్ ఆసుపత్రికి 350మంది పరీక్షల కోసం జనం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్ నగంలో 525 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ పేర్కొంటుంది.

గురువారం ఒక రోజు 110 ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిభిరాలు ఏర్పాటు చేస్తే అక్కడికి దగ్గు, జలుబు, ఒంటినొప్పులు, జ్వరం వంటి కేసులు వస్తున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో 436 ఆరోగ్య కేంద్రాలు పరిధిలో జ్వర సర్వే, ప్రత్యేక వైద్యశిబిరాలకు సిబ్బంది సిద్దం చేశారు. మూడు జిల్లాల పరిధిలో 259 బస్తీదవఖానలు, 177 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మూడు జిల్లా ఆసుపత్రులు, 16 ఏరియా ఆసుపత్రుల్లో విష జ్వరాలకు సంబంధించిన వైద్య సేవలు అందిస్తున్నట్లు, వీటితోపాటు కరోనా టెస్టులు కూడా చేస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. రోగికి మూడు రోజుల నుంచి ఐదు రోజుల్లో లక్షణాలు తగ్గకపోతే వెంటనే వారిని లక్షణాలను బట్టి కరోనా, డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తామని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.

వ్యాధులు బారినపడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక శిభిరాల్లో వైద్యులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు, ఈగలు వాలకుండా శుభ్రంగా తుడువాలి. ప్రతిరోజు ఎప్పటికప్పుడు వేడి నీళ్లు, వేడి ఆహారం వండుకుని తీసుకుంటే మంచిది. ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుకుని, బయట పదార్దాలు తీసుకోకూడదు. ప్రీజ్‌లోని ఆహారం తీసుకోవద్దు, ఐస్‌క్రీం, పానీపూరి వంటి జండ్ పుడ్‌లకు దూరంగా ఉండాలి. అవసరం ఉంటే బయటకు రావాలి అవనసరంగా బయటకు వెళ్లితే కొత్తరోగాలు సోకుతాయని సూచిస్తున్నారు. ప్రతి రోజు ఇంట్లో వ్యాయామం, యోగా తప్పకుండా చేసి, మిత ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News