Monday, January 27, 2025

పురపాలికల్లో ప్రత్యేక అధికారుల పాలన

- Advertisement -
- Advertisement -

మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ 120 మున్సిపాలిటీలు,
9 కార్పొరేషన్లలో నేటి నుంచి అమల్లోకి స్పెషలాఫీసర్ల పాలన

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తం గా పురపాలికల్లో ప్రత్యేకాధికారుల పాలన అ మల్లోకి వచ్చింది. ఈ నెల 26 ఆదివారంతో పాలకవర్గాల గడువు తీరడంతో 27 సోమవారం నుంచి ప్రత్యేకాధికారులను నియమిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్‌లలో ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చాయి. – కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఈ నెల 28న పాలకవర్గం కాలపరిమితి ముగిస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి అక్కడ ప్ర త్యేకాధికారి పాలన ప్రారంభమవుతుంది. కాలపరిమితి ముగిసే పాలకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి కొత్త పాలక మండళ్లు కొలువుదీరే వరకూ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News