Monday, January 20, 2025

స్టిక్కర్లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

ప్రెస్, ఎమ్మెల్యే, పోలీస్, బ్లాక్ ఫిల్మ్ గ్లాస్‌లపై తనిఖీలు
నకిలీ వ్యక్తులపై కేసులు నమోదు
ఎమ్మెల్యే షకీల్ కారు ప్రమాదంతో మేల్కొన్న పోలీసులు

Special police drive on stickers

మనతెలంగాణ, సిటిబ్యూరో: నకిలీ స్టిక్కర్లను వాహనాలకు అతికించుకుని తిరుగుతున్న వాహనాలపై నగర పోలీసులు కొరడాజులిపిస్తున్నారు. నగరంలోని స్టిక్కర్లను దుర్వినియోగం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. బోదన్ ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారు ఈ నెల 18వ తేదీన జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించిన విషయం తెసిందే. ఈ సంఘటనలో రెండున్నర నెలల పసికందు మృతిచెందగా ఏడాది వయస్సు ఉన్న బాలుడితోపాటు ముగ్గురు మమిళలు గాయపడ్డారు. కారుపై బోధన్ ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర ఉంది. ఇది వివాదానికి దారి తీయడంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

బ్లాక్ ఫిల్మ్, ప్రెస్, ఎమ్మెల్యే, ఎంపి పేరుతో స్టిక్కర్లు పెట్టుకుని తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. నకిలీ వ్యక్తులపై కేసులు నమోదు, జరిమానా విధిస్తున్నారు. బ్లాక్ ఫిల్మ్ పెట్టుకున్న వారికి జరిమానా విధించడంతోపాటు ఫిల్మ్‌ను తొలగిస్తున్నారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు వాహనంలో లేకున్నా వారి పేరుతో స్టిక్కర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. ఎపిలోని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్‌తో తిరుగుతున్న కారుపై కేసు నమోదు చేసి స్టిక్కర్‌ను తొలగిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించని వారు ఎంతటివారైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

కొందరు వ్యక్తులు ప్రెస్‌లో పనిచేయకున్నా పోలీసుల తనిఖీలు తప్పించుకోవడానికి స్టిక్కర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. దీనిపై సీరియస్‌గా ఉన్న పోలీసులు గతంలో కూడా నగరంలో తనిఖీలు నిర్వహించారు. తాజాగా కారు సంఘటన జరగడంతో ప్రెస్ స్టిక్కర్లు పెట్టుకున్న వారిని కూడా తనిఖీలు చేస్తున్నారు.

పోలీసులతో వాగ్వాదం….

బ్లాక్ ఫిల్మ్‌తో కారులో తిరుగుతున్న వారిపై పోలీసులు జరిమానా విధిండమే కాకుండా ఫిల్మ్‌ను తొలగిస్తుండడంతో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్‌ను వాడకపోవడంతో మోటార్ వెహికిల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా వాహనదారులు నడుచుకోవాలని చెబుతున్నారు. నగరంలో రెండు వారాలపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News