హైదరాబాద్ : రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇండియా, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రతినిధుల సదస్సులో పార్క్ హయత్ లో పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వీరితో పాటు శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. ప్రభుత్వం తరపున పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. వివిధ దేశాల ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధిస్తోందని చెప్పారు. పలు దేశాల పారిశ్రామికవేత్తలు భారత్ వైపు చూస్తున్నారని, పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. తెలంగాణ ఎంఎస్ఎంఈలు ప్రపంచస్థాయిలో సత్తా చాటేలా ప్రత్యేక పాలసీ ఉందని పేర్కొన్నారు. జహీరాబాద్ నిమ్జ్ లో పెట్టుబడులకు 6 అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయని, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోత్సహించి రైతులను వ్యాపారవేత్తలుగా మార్చుతామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
పలు దేశాల పారిశ్రామికవేత్తలు భారత్ వైపు చూస్తున్నారు: శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -