Wednesday, January 22, 2025

యాదగిరిగుట్టలో నూత‌న‌ హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు..

- Advertisement -
- Advertisement -

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వ‌ద్ద కొత్త హెలికాప్టర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున ప్రతిమ గ్రూప్స్‌ ఎండీ బోయినపల్లి శ్రీనివాసరావు నూతనంగా ఓ హెలికాప్ట‌ర్ కొనుగోలు చేశారు. ఈ క్ర‌మంలో యాదాద్రి టెంపుల్‌ సిటీలోని హెలిప్యాడ్‌ వద్ద హెలికాప్ట‌ర్‌కు ఆలయ అర్చకులతో పూజలు చేయించారు. మ‌హారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావుతో కలిసి ప్రతిమ గ్రూప్స్‌ ఎండీ బోయినపల్లి శ్రీనివాసరావు హెలికాప్టర్‌ వద్ద కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా వాహన పూజలు నిర్వహించారు.

కాగా, గతంలో టంగుటూరు అంజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన హెలికాప్టర్‌కు మొదటిసారిగా యాదగిరిగుట్ట క్షేత్రంలో పూజలు నిర్వహించారు. ఆ హెలికాప్టర్‌కు స్వామివారి పేరునే పెట్టారు.ఇక, ఎయిర్‌ బస్‌ కార్బురేటర్‌ 135 హెలికాప్టర్‌ 500 కిలోమీటర్ల రేంజ్‌, 20 వేల ఫీట్ల ఎత్తు వరకు ప్రయాణం చేస్తుందని ఫైలట్‌ కెప్టెన్‌ దీపక్‌ కులకర్ణి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News