Monday, January 20, 2025

బాబు బయటకు రావాలని ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నాలుగో రోజు టిడిపి నేతలు రిలే దీక్షలు చేపట్టారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ టిడిపి శ్రేణుల రిలే దీక్షలు చేపట్టారు. చంద్రబాబు బయటకు రావాలని కోరుతూ ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. జగన్ కక్ష సాధింపు చర్యలపై టిడిపి, జనసేన, సిపిఐ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా బెంగళూరులో రెండో రోజు నిరసనలు చేపట్టారు. తెలుగు సంఘాలతో పాటు బెంగళూరు నగర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. బెంగళూరు విధాన సౌధ సమీపంలోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలుగు సంఘాలకు ఐటి ఉద్యోగులు, నిపుణులు మద్దతు ప్రకటించాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

Also Read: విదేశాలకు పారిపోయిన చంద్రబాబు పిఎస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News