- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. వేములవాడ, శ్రీశైలంతో పాటు పలు ప్రధానాలయాలకు వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల్లో పుణ్యస్నానాలు చేశారు. దీంతో అటు విజయవాడలోని దుర్గా ఘాట్ వద్ద రద్దీ నెలకొంది. రాజమహేంద్రవరం, భద్రాచలంలో గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీపాలను వెలిగించి నదుల్లో వదిలారు.
- Advertisement -