Monday, December 23, 2024

యాదాద్రిలో క్షేత్రపాలకుడికి విశేష పూజలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజను అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీ ఆంజనేయస్వామికి విశేషమైన రోజు కావడంతో ఉదయం శ్రీఅంజనేయస్వామి వారికి సింధూర క్షేపనం నిర్వహించి లక్ష తమలపాకులతో నాగవల్లి దళార్చన జరిపి శాస్త్రోక్తంగా ఆకుపూజను నిర్వహించారు.

పాతగుట్ట పుష్కరిణి వద్ద గల ఆలయంలో ఆకుపూజను నిర్వహించగా భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. శ్రీలక్ష్మీనరసింహుని దర్శనార్ధం వచ్చిన భక్తులు యాదాద్రి క్షేత్రములో నిర్వహించిన నిత్యపూజలు సుప్రభాతం,అర్చన, అభిషేకం, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, పుష్పార్చన, జోడి సేవ తదితర పూజలలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు.

నిత్యరాబడి…..
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా మంగళవారము రోజున 28,01,420 రూపాయల ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

పట్టణంలో….
యాదగిరిగుట్ట పట్టణంలోని పాదాల సమీపంలో ఉన్న శ్రీ అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అంజనేయ స్వామికి అభిషేకం, ఆకు పూజ నిర్వహించి దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News