Sunday, December 22, 2024

ఆత్మహత్యలకు అడ్డాగా బాసర గోదావరి

- Advertisement -
- Advertisement -

బాసర : ఆత్మహత్యలకు బాసర గోదావరి కేరాప్‌గా మారింది. దక్షిణ భారతదేశంలో చదువుల తల్లి బాసర సరస్వతి జ్ఞానానికి ప్రతీకగా వెలుగొందుతుంది. కానీ ఈ సరస్వతి అమ్మవారి క్షేత్రంలోని గోదావరిలో పలువురు క్షణికావేశంతో నిండు జీవితాన్ని నీటి పాలు చేసుకుంటున్నారు. కుటుంబంలో కలహాలు, క్షణికావేశంతో నిండు జీవితాన్ని నీటి పాలు చేసుకుంటున్నారు. కుటుంబంలోని కలహాలు,నిండు జీవితం గోదావరి నదిలో కలిసిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ విఫలమై, అనారోగ్య సమస్యలు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ నుంచి కాకుండా భైంసా, నిర్మల్, మహారాష్ట్ర, ధర్మాబాద్, పర్బని, నాందెడ్, తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బలవన్మరణానికి పాల్పడుతుండడంతో బాసర తీర్థం ఆత్మహత్యలకు అడ్డాగా మారింది. కాగా ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు ఆందోళన కరంగా మారాయి. బాసర వద్ద సిసి కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని రక్షణ చర్యలు చేపట్టాని పోలీసులతో నిరంతరం గస్తీ చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు మరికొంత మంది నది తీర్థం వద్ద ఆత్మహత్యకు పాల్పడగా వారి మృతదేహాలు కొట్టుకు పోతూ ఆచూకి లేకుండా పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారుతుంది. బయటకు తీయడం లాంటి పనులతో స్థానిక పంచాయతీ సిబ్బంది సైతం అదనపు భారంగా మారింది. నది తీరం వద్ద 24 గంటల పాటు గస్తీ తిరిగేలా పోలీసు సిబ్బందితో పాటు హోంగార్డును అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడేందుకు వచ్చిన వ్యక్తులను గుర్తించి పోలీసు శాఖ ద్వారా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే వారి సమస్యల నుండి బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. గోదావరిలో చేపలు పట్టే గంగపత్రులు సందర్భాల్లో ప్రాణ రక్షకులుగా చాలా మారుతున్నాయి. మహారాష్ట్ర పర్బనికి చెందిన విద్యార్థిని బాసరలో రైల్వే బ్రిడ్జి నుండి రాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరిలో దూకగా బ్రిడ్జి స్తంభం ఇనుప కడ్డి పట్టుకొని రాత్రంగా నీటిలోనే గడిపింది.

ఉదయం గమనించిన జాలర్లు ఆమెను సురక్షితంగా రక్షించారు. నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. పుణ్యక్షేత్రంలోని గోదావరిలో ఆత్మహత్యలు తరచూ జరగడం చాలా బాధాకరం. ఆత్మహత్యలతో చాలా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. కాట్టి నిజామాబాద్, నిర్మల్ జిల్లా యంత్రాంగం స్పందించి ఆత్మహత్యలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.

అలంకార ప్రాయంగా ఫారెస్టు సిసి కెమెరాలు
భైంసా నిజామాబాద్ బాసర గోదావరి బ్రిడ్జి గోదావరి నుండి వెళ్లే మార్గంలో ఫారెస్టు డిపార్టుమెంట్‌కు చెందిన చెక్‌పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు అవి పనిచేయకపోవడంతో ఈ రహదారి వెంట వెళుతున్న వాహనాలను సిసి కెమెరాలు నిక్షిప్తం అవడం లేదు. సిసి కెమెరాల వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే ఈ సిసి కెమెరాలు అందుబాటులో తీసుకరావాలని కోరుతున్నారు. దీంతో పాటు నది తీరం వద్ద సిసి కెమెరాలు అందుబాటులో ఉంచాలని భక్తులు వేడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News